1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Shortfilm Actress Amulya Sri Case, Accused Dies By Suicide After Being Released On Bail

షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ కేసులో కీలక మలుపు - ప్రధాన నిందితుడు ఆత్మహత్య

anupa sri - mahesh
షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు నుంచి బెయిలుపై విడుదలైన కొద్ది రోజులకే ఈ విషాదం చోటుచేసుకుంది. సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ అమూల్య మృతి కేసులో మహేష్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవలే కోర్టు నుంచి బెయిల్‌పై మహేష్ విడుదలయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకోగా పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించింది. అలాగే, మహేష్ మొబైల్ ఫోన్, కాల్ లాగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బెయిల్ తర్వాత ఎవరైనా అతన్ని బెదిరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణ పట్ల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశంపై కూడా విచారణ సాగుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జీఎస్‌ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల మోడల్స్‌తో తిరుమలలో ఇస్రో ఛైర్మన్ (video)