1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ కవితలు

నా తలపుల్లో నీరూపం

ప్రేమాయణం కవితలు నా తలపుల్లో నీరూపం
నిను చూచిన ఆ క్షణం నా మదికి అపురూపమైంది
నా స్మృతుల సెలయేటిలో ఎగసిపడిన ఆనంద తరంగం మనసులోనే నిక్షిప్తమైంది

నిను చూచిన ఆ ఒక్క క్షణం కలయా అని నేననుకుంటే... కాదు నిజమేనంటూ మది చెబుతోంది
నిజమేననుకుని సంబరపడదామంటే జరిగిందంతా కలలా అనిపిస్తోంది

నిను చూచిన ఆ మధురక్షణం కలయా... నిజమా తెలియక సతమతమయ్యే నాకు...
నిజమై కనిపిస్తావో కాదని కలలాగే మిగిలిపోతావో నీ ఇష్టం.
About Writer
Munibabu