మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (08:34 IST)

ట్యూషన్‌కు వెళుతున్నానని చెప్పి ఫ్రెండ్‌తో వెళ్లింది... గదిలో బంధించి గ్యాంగ్ రేప్

యువతీ యువకుల మధ్య ఏర్పడే ఫేస్‌బుక్ పరిచయం ఎన్నో అనర్థాలకు దారితీస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ ఫ్రెండ్ చేతిలో ఓ బాలిక మోసపోయింది. ట్యూషన్‌కు వెళుతున్నానని తల్లిదండ్రులకు అబద్దం చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్, దర్యాగంజ్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. దీంతో గత యేడాది కాలంగా అతనితో చాటింగ్ చేస్తూ వస్తోంది. ఆ స్నేహంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. 
 
ఈ క్రమంలో ట్యూషన్‌కు వెళుతున్నానని తల్లిదండ్రులకు అబద్దం చెప్పిన ఈ బాలిక.. తన ఫేస్‌బుక్ స్నేహితుడుని కలిసింది. యువకుడు బాలికను లాంగ్ డ్రైవ్‌ పేరుతో మీరట్ తీసుకువెళ్లి అక్కడి హోటల్ గదిలో ఉంచాడు. అనంతరం తన స్నేహితుడులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
హోటల్ గదిలో యువకుల బారి నుంచి బయటపడిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించి సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు.