మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:28 IST)

ఈ చిట్కాలు పాటిస్తే.. అవి తొలగిపోతాయి..?

చాలామంది ఎప్పుడూ చూసిన ముఖం జిడ్డుగానే ఉంటుంది. ఎన్ని ప్రయోగాలు చేసిన ఎలాంటి లాభాలు కనిపించవు. అందుకు కింద చెప్పబడిన చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. అవేంటో చూద్దాం..
 
1. జిడ్డు చర్మతత్వం గలవారు స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసుకుని దాని నుండి వచ్చే రసాన్ని ముఖానికి బ్లీచ్‌లా వేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
2. ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా చేసిన మిశ్రమంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత చన్నీళ్లతో కడుక్కుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
3. ద్రాక్షపండ్ల నీటిలో నానబెట్టుకుని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండుసార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి.
 
4. రాత్రివేళలో అరకప్పు ఆముదం గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి గుజ్జు చేసి ముఖంపై మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంటయ్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.
 
5. బొప్పాయి పండును గుజ్జులా చేసుకుని ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎంతో మార్పు ఉంటుంది.
 
6. నారింజ తొక్కలను పొడి చేసి అందులో అరటి పండు గుజ్జు కలిపి ముఖానికి పూతగా వేసి ప్యాక్ ఆరాక గోరు వెచ్చని నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
 
7. బాదం పప్పులను నానబెట్టి గుజ్జు చేసుకోవాలి. ఈ గుజ్జులో కొద్దిగా గ్లూకోజ్ పౌడర్ కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చలు తగ్గుముఖం పడతాయి.