మేకప్‌తోనే నిద్రిస్తున్నారా.. జాగ్రత్త..?

Last Updated: మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:32 IST)
చాలామంది మేకప్ వేసుకుంటారు గానీ దానిని సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఇలా చేస్తే.. పలురకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. దాంతో చర్మమంతా ముడతలుగా మారి.. చూడడానికే విసుగుగా ఉంటుంది. ఇక ఎప్పుడూ మేకప్ వేసుకున్నా మీ ముఖం ముడతలుగానే ఉంటుంది. అందువలన వీలైనంతవరుకు నిద్రించే ముందు మేకప్ తొలగిస్తే మంచిది. మరి మేకప్ ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
   
 
1. పావుకప్పు గోరువెచ్చని పాలలో కొద్దిగా తేనె, వంటసోడా, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మేకప్ పోతుంది. దాంతో చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
2. మేకప్‌లో నిద్రిస్తే కంటి కింద నల్లటి వలయాలు కూడా వస్తాయి. ఎన్ని క్రీములు వాడినా ఎలాంటి లాభం ఉండదు. అందుకు ఏం చేయాలంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ పోతుంది.. నల్లటి వలయాలు కూడా రావు. 
 
3. ఆపిల్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించుకోవాలి. ఆపై ఆ నీటిలో కొద్దిగా వంటసోడా, ఉప్పు కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. రెండుగంటల తరువాత కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
4. క్యారెట్‌ను జ్యూస్‌లా చేసి అందులో చక్కెర, టమోటా గుజ్జు వేసి పేస్ట్‌లా చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా తరచు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. ముడతల చర్మం రాదు.  దీనిపై మరింత చదవండి :