మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (17:35 IST)

పాదాల రక్షణ కోసం ఈ చిట్కాలు పాటిస్తే..?

పాదాల రక్షణకు కొన్ని చిట్కాలు.. అందుకోసం ఇంట్లోనే తయారుచేసుకునే పదార్ధాలతో పాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఓ అరగంట సమయం మీ పాదాలకోసం కేటాయిస్తే అందమైన పాదాలు మీసొంతం. ఒక ప్లాస్టిక్‌ బౌల్‌లో గోరువెచ్చని నీటిలో సాఫ్ట్‌నెస్‌ కోసం కొన్ని చుక్కల చామోమైల్‌ వేయాలి. ఆ తరువాత పాదాలను 10 నిమిషాల పాటు అందులో ఉంచాలి. తరువాత తీసి టవల్‌తో తుడిచేస్తేచాలు మీ పాదాలు మృదువుగా తయారవుతాయి.
 
అలాగే ప్యూమిక్‌ స్టోన్‌ను నీటిలో నిమిషం పాటు ఉంచి ఆ రాయితో పాదాల చర్మాన్ని సున్నితంగా రుద్దాలి. అప్పుడు చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దాంతో పాదాలు సాఫ్ట్‌గా, స్మూత్‌గా తయారవుతాయి. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌గానీ, ఆయిల్‌ ఆయిల్‌ గానీ మీ పాదాలకు మర్దన చేసుకుంటే.. పాదాలకు బాగా విశ్రాంతి కలుగుతుంది. తిరిగీ అవి ఉత్తేజితం అవుతాయి. 
 
పాదాలు పగుళ్లుగా ఉన్నప్పుడు నీటిలో కొద్దిగా వంటసోడా, చక్కెర వేసి మరిగించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత పాదాలకు రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు క్రమంగా చేస్తే పాదాలు మృదువుగా, సున్నితంగా తయారవుతాయి.  
 
కాలిగోళ్లకు పాలిష్‌ వేయాలనుకున్నప్పుడు ముందుగా గోరును శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం నెయిల్‌పాలిష్‌ రియూవర్‌ను ఉపయోగించవచ్చు. రిమూవర్‌ను ఉపయోగించిన తరువాత టవల్‌తో పూర్తిగా శుభ్రపరిచిన తరువాతే పాలిష్‌ వేసుకోవాలి. పాలిష్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ చర్మానికి తాకకుండా చూసుకోవాలి. నెయిల్‌ పాలిష్‌ను రిమూవ్‌ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి. ఇలా వారానికి ఒక సారి మీ పాదాలపై శ్రద్ధ ఉంచితే అందమైన పాదాలు మీ సొంతం అవుతాయి.