శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (17:23 IST)

నిమ్మరసాన్ని పాదాలకు రాసుకుంటే..?

ఈ చలికాలంలో పాదాలు నీళ్లల్లో ఉండి ఉండి పొడిబారుతుంటారు. దీంతో పాదాలు పగుళ్లు, ఇన్‌ఫెక్షన్స్, చీము కారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటిని తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితాలు కనిపించవు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి... అవేంటంటే...
 
బకెట్ నీటిలో కొద్దిగా లావెండర్ ఆయిల్ కలిపి పాదాలను అరగంట పాటు అలానే ఉంచాలి. ఇలా చేయడం వలన పాదాలపే పేరుకున్న మట్టి పోతుంది. తద్వారా సమస్య అదుపులో ఉంటుంది. రాత్రి పడుకునే ముందుగా పాదాలకు హ్యాండ్‌క్రీమ్‌లో కొద్దిగా నిమ్మరసం కలిపి రాసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పాదాలు మృదువుగా మారుతాయి. 
 
ఆలివ్ నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా గ్లిజరిన్, పెరుగు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు రాసుకుని 20 నిమిషాల తరువారు వెచ్చటి నీటిలో కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తే పాదాలు పగుళ్లు, ఇన్‌ఫెక్షన్స్ రావు. దాంతో గట్టిబడిన పాదాలు కాస్త మెత్తబడుతాయి.

ఎప్పుడు చూసిన దుమ్ము వాతావరణంలో గడిపేవారికి పాదాలు కాంతి విహీనంగా మారుతుంటాయి. అందువలన ఇంటికి చేరుకున్న తరువాత పాదాలను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదంటే మురికి పోకుండా పాదాలు నల్లగా మారిపోయి చీము కారుతుంది. ఈ సమస్య కారణంగా ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. చీము కారకుండా ఉండాలంటే పాదాలకు పసుపు రాసుకుంటే ఫలితం ఉంటుంది.