సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (09:50 IST)

మేకప్ తొలగించాలంటే.. ఇలా చేయాలి...?

ఫంక్షన్స్‌కి వెళ్తున్నాం అంటే చాలు ముఖామికి మేకప్, కళ్లకు ఐలైనర్, పెదాలకు లిప్‌స్టిక్ వేసేస్తుంటారు. ఇవన్నీ వేసేటప్పుడు బానే ఉంటుంది కానీ, దానిని శుభ్రం చేయడం అంత సులువు కాదు. ఒకవేళ మీరు మేకప్ శుభ్రం చేయకపోతే చిన్న వయసులోనే ముఖం ముడతలుగా మారుతుంది. అందుకు ఏం చేస్తే సరిపోతుందో పరిశీలిద్దాం...
 
ఏ మేకప్‌నైనా సులువుగా తుడిచేయాలంటే తేనెలో చిటికెడు వంటసోడా చల్లి దాంతో ముఖాన్ని కడుక్కోవచ్చు. ఈ మిశ్రమం చర్మ తేమ, మృదుత్వాన్ని కోల్పోకుండా చేస్తుంది. ఈ ప్యాక్ ఆరిన తరువాత చన్నీటితో కడిగేసుకోవాలి. పాలలో న్యూట్రియన్ ఫాక్ట్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి మేకప్ శుభ్రం చేయడానికి చాలా ఉపయోగపడుతాయి. ఎలాగంటే..
 
పాలలో కొద్దిగా అలివ్ నూనె కలిపి అందులో దూదిని ముంచి ఆ దూదితో ముఖాన్ని మర్దన చేసుకుంటే మేకప్ పోతుంది. పాలు ముఖానికి రాసుకున్నప్పుడు దానిలోని పోషక విలువలు చర్మం లోనికి వెళుతాయి. అందువలనే మేకప్ సులభంగా పోతుంది. వాటార్‌ఫ్రూఫ్ మేకప్‌ని తొలగించడం కాస్త పెద్దపనే.. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె చక్కగా ఉపయోగపడుతుంది. 
 
కొబ్బరి నూనెను కొన్న చుక్కల తేనె కలిపి ముఖానికి రాయాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేస్తే సమస్య పోతుంది.  మినపప్పును పొడిచేసి అందులో కొద్దిగా టమోటా, చింతపండు గుజ్జు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే మేకప్ త్వరగా పోతుంది.