శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (16:12 IST)

నిమ్మరసం ప్యాక్‌తో ఎన్ని లాభాలో..?

చాలామందికి ముఖంపై మెుటిమలు విపరీతంగా ఉంటాయి. ఇవి చర్మం అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఈ మెుటిమల కారణంగా నల్లటి మచ్చలు కూడా వస్తుంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో బయట దొరికే క్రీమ్స్ కాకుండా ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలు ఎలా ఉపయోగించాలో చూద్దాం..
 
పాలలోని న్యూట్రియన్స్ చర్మ ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇక నిమ్మ గురించి చెప్పాలంటే.. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. మరి ఈ రెండింటిని జతచేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. పాలలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
టమోటా ప్యాక్ వేసుకుంటే నల్లటి చర్మం తెల్లగా మారుతుంది. దాంతో పాటు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకుపంపుతుంది. అంతేకాకుండా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. 2 టమోటాలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా శెనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
నిమ్మ ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తుంది. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. దంతాలు దృఢంగా చేస్తుంది. ఇటువంటి నిమ్మరసంతో ప్యాక్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఒట్టి నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత దూదితో మర్దన చేసుకుని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.