అంగస్తంభన సమస్యరాకుండా ఉండాలంటే...
చాలా మంది పురుషుల్లో అంగస్తంభన సమస్య ఉంటుంది. ఈ సమస్యతో పడక గదిలో భార్యను సుఖపెట్టలేక తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. నిజానికి ఈ సమస్యకు కేవలం 'ఆ' ప్రత్యేక అవయవంలో ఉండే లోపం మాత్రమేనని భావించరాదు. మొత్తం శరీర వ్యవస్థల్లో ప్రత్యేకించి సప్తధాతువుల్లో ఏర్పడే లోపాలు కూడా ఒక ప్రధాన కారణమే. ఇలాంటివాటిలో ఒకటి హార్మోన్ సమస్యలు కూడా.
అయితే, అంగస్తంభన సమస్య ఉత్పన్నంకాకుండా ఉండాలంటే మానసిక ఆందోళన, ఒత్తిడికి గురికాకుండా యోగా, వ్యాయామం, వాకింగ్ వంటివి క్రమం తప్పకుండా చేస్తుండాలి. మద్యం సేవించడం, పొగ తాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
ముఖ్యంగా, మనం తీసుకునే ఆహారంలో పాలు, పండ్లు, మినుములతో చేసిన పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. అలాగే, ఈ సమస్యతో బాధపడేవారు నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు స్వీకరించి, ఆ ప్రకారంగా నడుచుకున్నట్టయితే ఈ సమస్యను అధికమించవచ్చు.