బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (12:58 IST)

పంప్‌కిన్‌తో ఐస్‌క్రీమా.. ఎలా చేయాలో చూద్దాం..?

గుమ్మడి కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. పురుషుల్లో శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. గొంతునొప్పిగా గుమ్మడి కాయ జ్యూస్‌లా చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. అలాకాకుంటే.. ఐస్‌క్రీమ్ కూడా తీసుకోవచ్చు.. మరి పంప్‌కిన్ ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం..

 
కావలసిన పదార్థాలు:
గుమ్మడి గుజ్జు - 2 స్పూన్స్
అరటిపండు - 1
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ - ఒకటిన్నర స్పూన్
మాపిల్ ఎక్స్‌ట్రాక్ట్ - ఒకటిన్నర స్పూన్
చాక్లెట్ చిప్స్ - పావుకప్పు
తేనె - కొద్దిగా.
 
తయారీ విధానం:
ముందుగా బ్లెండర్‌లో గుమ్మడి గుజ్జు, అరటిపండు, తేనె, వెనీలా, మాపిల్ ఎక్స్‌ట్రాక్ట్ వేసి బాగా కలిసేలా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమం బాగా మెత్తని పేస్ట్‌లా తయారైన తరువాత అందులో చాక్లెట్ చిప్ వేసి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ పంప్‌కిన్ ఐస్‌క్రీమ్ రెడీ.