బీట్ రూట్ కజ్జికాయలు తయారీ విధానం...
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ తురుము - 2 కప్పులు
క్యారెట్ తురుము - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు
మైదా - 350 గ్రామ్స్
జీడిపప్పు, బాదం - అరకప్పు
నెయ్యి - 2 స్పూన్స్
నూనె - సరిపడా
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - 2 కప్పులు
పాలు - ఒకటిన్నర కప్పు
తేనె - 2 స్పూన్స్
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండి వేసుకుని అందులో నెయ్యి, తేనె, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేగించి తీసేయాలి. అదే బాణలిలో బీట్‌రూట్, క్యారెట్, కొబ్బరి తురుము ఒకదాని తరువాత ఒకటి వేగించాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో వేగించిన తురుములు, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మైదా ముద్దలని ఉండలుగా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. పూరీల మధ్యలో తగినంత తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. అంతే... బీట్ రూట్ కజ్జికాయలు రెడీ.