శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (12:26 IST)

కాకరకాయ కబాబ్ తయారీ విధానం....

కాకరకాయ చేదుగా ఉందని చాలామంది అంతగా తీసుకోరు. కాకరలోని న్యూటియన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. అధిక బరువు గలవారు రోజూ కాకర జ్యూస్ తీసుకుంటే బరువు తగ్గుతారు. లేదా కాకరకాయ కబాబ్ తీసుకోండి..
   
 
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - అరకప్పు
క్యారెట్ తురుము - ముప్పావు కప్పు
పచ్చిబఠాణి - పావు కప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
పచ్చిమిర్చి - 2
ఆమ్‌చూర్ - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం: 
ముందుగా కాకరకాయలను సన్నగా తరిగి వాటిలో కొద్దిగా ఉప్పు వేసి కాసేపు ఉంచాలి. ఇప్పుడు ఒక బాణలిలో కాకరకాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిబాఠాణి, కొత్తిమీర, బ్రెడ్ పొడి, పచ్చిమిర్చి, ఆమ్‌చూర్ పొడి, ఉప్పు వేసి బాగా ముద్దగా తయారుచేసుకోవాలి. ఆ తరువాత తరిగిన కాకరకాయలలో ఈ మిశ్రమాన్ని పెట్టి నూనెలో వేయించుకోవాలి. అంతే కాకరకాయ కబాబ్ రెడీ.