శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (14:23 IST)

సేమియా కేసరి ఎలా చేయాలో తెలుసా..?

సేమియాలో ప్రోటీన్స్, న్యూట్రియన్స్ పుష్కలంగా ఉన్నాయి. సేమియా అజీర్తి సమస్యను తొలగిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీయల్ గుణాలు  ఆకలి నియంత్రణకు చాలా ఉపయోగపడుతాయి. దాంతో పాటు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి. ఇలాంటి సేమియాతో కేసరి ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
సేమియా - 1 కప్పు
నీరు - 2 కప్పులు
చక్కెర - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
ఫుడ్ కలర్ - కొద్దిగా
యాలకుల పొడి - అరస్పూన్
బాదం, జీడిపప్పు - పావుకప్పు
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో నెయ్యి వేసి సేమియాను చిన్నమంటపై వేయించి ఆ తరువాత కొద్దిగా నీరు పోసి కాసేపు ఉడికించాలి. ఆ తరువాత పంచదార వేసి అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ కరగనివ్వాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి, ఫుడ్‌ కలర్ వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన బాదం, జీడిపప్పులు వేసి మరోసారి కలిపి దించేయాలి. అంతే... టేస్టీ అండ్ స్వీటీ సేమియా కేసరి రెడీ.