బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (13:38 IST)

ఆలూ మలాయ్ కోఫ్తా తయారీ విధానం...

బంగాళాదుంపల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఆలూ ఎంతో మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మరి ఆలూతో మలాయ్ కోఫ్తా ఎలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
పన్నీర్ - 250 గ్రాములు
ఆలుగడ్డలు - 100 గ్రాములు
కోటా చీజ్ - 25 గ్రాములు
మెున్నజొన్న పిండి - 15 గ్రాములు
జీడిపప్పు - 25 గ్రాములు
వెన్న - 5 గ్రాములు
ఇలాయిచీ పౌడర్ - 2 స్పూన్స్
తెల్ల మిరియాల పొడి - 1 స్పూన్
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా
చక్కెర - 5 స్పూన్స్ 
క్రీమ్ - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా ఆలుగడ్డలను ఉడికించి అందులో మెున్నజొన్న పిండి, పన్నీర్, ఇలాయిచీ పౌడర్, తెల్ల మిరియాల పొడి, ఉప్పు, చక్కెర, కోటా చీజ్ వేసి మెత్తగా కలుపుకుని ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ముందుగా తయారుచేసుకున్న ఉండలను వేయించుకోవాలి. మరో బాణలిలో వెన్న వేసి అందులో జీడిపప్పు వేయించి కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వేయించుకున్న ఉండలను వేస్తూ అలానే క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే మలాయ్ కోఫ్తా రెడీ..