శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:50 IST)

వంటింటి చిట్కాలు మీ కోసం...

బంగాళాదుంపలు ఉడికించిన తరువాత తొక్క తీస్తే అంత త్వరగా రాదు. అలాంటప్పుడు అవి ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకుంటే తొక్క తేలికగా వస్తుంది. బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిల్లో కొద్దిగా చక్కెరను కలుపుకుంటే రంగు మారకుండా ఉంటుంది. పప్పు త్వరగా ఉడకాలంటే అంద

బంగాళాదుంపలు ఉడికించిన తరువాత తొక్క తీస్తే అంత త్వరగా రాదు. అలాంటప్పుడు అవి ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకుంటే తొక్క తేలికగా వస్తుంది. బఠాణీలు ఉడికించేటప్పుడు వాటిల్లో కొద్దిగా చక్కెరను కలుపుకుంటే రంగు మారకుండా ఉంటుంది. పప్పు త్వరగా ఉడకాలంటే అందులో నూనెను కలుపుకుంటే చాలు.
 
పన్నీర్‌‌ను ఉడికించేటప్పుడు వాటిల్లో కొద్దిగా ఉప్పును కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే పిండిని కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా మెుక్కజొన్న పిండి, పాలు కలుపుకుంటే చాలు. నూడుల్స్ విరివిగా రావాలంటే వాటిని చల్లని నీటితో వేసుకుంటే మంచిది. ఉల్లిపాయలు కట్‌ చేసే ముందుగా వాటిని నీళ్ళల్లో కాసేపు ఉంచుకోవాలి. ఇలా చేస్తే కట్‌ చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రావు.