బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: బుధవారం, 29 ఆగస్టు 2018 (18:58 IST)

జుట్టు ఊడిపోతుందా? ఐతే ఈ చిట్కాలు పాటిస్తే సరి...

సాధారణంగా స్త్రీలు జుట్టు పొడవుగా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు. కనుక పొడవు జుట్టు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాని జుట్టు పెరుగుదల మనం తినే ఆహారం, మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. కాని సరియైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలంగా మందులు వా

సాధారణంగా స్త్రీలు జుట్టు పొడవుగా ఉంటే ఎంతో అందంగా కనిపిస్తారు. కనుక పొడవు జుట్టు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాని జుట్టు పెరుగుదల మనం తినే ఆహారం, మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుంది. కాని సరియైన పోషకాహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలంగా మందులు వాడటం వలన, వాతావరణంలో ఉండే కాలుష్యం వలన జుట్టు ఊడిపోయి బలహీనంగా, తెల్లగా తయారవుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించవలసిందే. అవి ఏమిటో చూద్దాం.
 
1. ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమంతప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
 
2. కొబ్బరినూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు నెరిసిపోకుండా ఉండటానికి ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  
 
3. రెండు టేబుల్ స్పూన్ల తేనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని మూడింటిని బాగా కలపాలి. దీన్ని జుట్టు చివర్లకు వచ్చేలా రాసుకొని పదిహేను నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరగటమే కాకుండా చివర్లు చిట్లిపోకుండా అందంగా వంపు తిరిగి ఉంటాయి.
 
4. కుంకుడు కాయలను గంటసేపు నీటిలో నానబెట్టి దానిలో కాస్త ఉసిరి పొడిని కలపాలి. ఈ మిశ్రమంతో తలస్నానం చేస్తే శిరోజాలు పట్టుకుచ్చులా నల్లగా నిగనిగలాడతాయి.
 
5. నిమ్మకాయ గింజలు, కొద్దిగా మిరియాలు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని  తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.