సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : గురువారం, 15 నవంబరు 2018 (14:23 IST)

ఫోర్‌ప్లే చేయమంటే డైరెక్టుగా పనిలోకి దిగిపోతున్నారు.. ఏం చేయను?

దంపతుల్లో పడకింటి సౌఖ్యం అణువణువునా ఉండాలి. అయితే, ముదిరిన భావాలను ముచ్చటైన మూల్గులుగా మలచలేక ఎందరో మూడీగా గడుపుతూ తమ దాంపత్య జీవితాన్ని గడిపేస్తుంటారు. దీనికి కారణం శృంగారం పట్ల సరైన అవగాహన లేకపోవడం. ఒకవేళ అవగాహన ఉన్నప్పటికీ సిగ్గు, బిడియం, భయం వంటి సమస్యలతో వారు కుంగిపోతుంటారు. ఫలితంగా మానసిక సంసిద్ధతతో అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. 
 
ముఖ్యంగా, భాగస్వామి నుంచి భార్యకు సరైన ఫోర్‌ప్లే లోపించిన పక్షంలో ఆ స్త్రీ త్వరగా లైంగకోద్రేకం పొందలేరు. దీనివల్ల జననేంద్రియాల్లో లూబ్రికేషన్ లోపిస్తుంది. నిజానికి శృంగారానికి ఉపక్రమించే స్త్రీకి తగినంతగా ఫోర్‌ప్లే అందించాలి. సున్నితమైన మాటలతో, చేతలతో స్త్రీలకు చేరువవ్వాలి. స్త్రీలు తగినంత ప్రేరణ పొందేలోపే అంగప్రవేశం చేసే ప్రయత్నం చేయరాదు. 
 
అలా చేస్తే స్త్రీలకు నొప్పి కలిగి లైంగి చర్యమీదే ఆసక్తి సన్నిగిల్లిపోయే ఆస్కారం ప్రమాదం ఉంది. తగినంత సమయం తీసుకుని ఫోర్‌ప్లేతో స్త్రీలను లైంగిక చర్యకు సిద్ధం చేయాలి. అపుడే తగినన్ని స్రావాలు (లూబ్రికేషన్స్) స్రవించి లైంగిక చర్య సులభతరమవుతుంది. ఈ సమస్యను లోపించినట్టయితే తక్షణం వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.