చలిగా వుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారా?
చాలామంది శీతాకాలంలో చలిగావుందని వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. స్నానం చేసే సమయంలో హాయిగానే ఉంటుంది. కానీ, ఆ తర్వాత చర్మం పొడిబారిపోతుంది. అందుకే చలికాలంలో గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఎంతో మందిని ఆరోగ్యం నిపుణులు అభిప్రాయడుతున్నారు.
అలాగే, చలికాలంలో దాహంగా లేకపోయినా సరే కొద్దికొద్దిగా నీరు తాగుతుండాలని సూచన చేస్తున్నారు. వీటితో పాటు సీజన్‌లో లభించే పండ్లను తీసుకుంటే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అలాగే, ముఖం బాగా పొడిబారిపోయిన పక్షంలో తేనె, కాగబెట్టిన పచ్చిపాలను మిశ్రమంగా చేసిన దాన్ని ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దన చేయాలని, అలా 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్ర పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.