శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (11:57 IST)

చలికాలంలో - భోజనం చేశాక ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే..

బెల్లం.. తీపిపదార్థం. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడేది. అలాంటి బెల్లాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడుతారని, శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆయుర్వేద వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ప్రతి రోజూ ఓ బెల్లం ముక్కను ఆరగించడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయ పడుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో బెల్లం ముక్కను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి కావల్సిన వేడి అందుతుంది. అలాగే, ఎన్నో రకాల రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. గర్భవతి అయిన మహిళలు బెల్లం తినడం వల్ల ఎంతో మేలని వారు చెబుతున్నారు. 
 
* బెల్ల - నెయ్యి సమపాళ్ళలో కలిపి తినడం వల్ల 5 లేదా 6 రోజుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. 
* పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటల తినడం వల్ల ముక్కు నుంచి నీరుకారడం తగ్గిపోతుంది.
* నెయ్యితో బెల్లం కలిపి వేడిచేసి నొప్పివున్న చోట పూస్తే బాధ నివారణ అవుతుంది.
* బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల క్షణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడిచేసి శరీరంలో ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. 
 
* భోజనం చేసిన తర్వాత ఓ చిన్నపాటి బెల్లం ముక్కను నోట్లో వేసుకోవడం వల్ల అసిడిటీని తగ్గించుకోవచ్చు. 
* కాలేయాన్ని శుభ్రం చేయడంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. 
* క్రమం తప్పకుండా బెల్లం తినడం వల్ల కాలేయంలోని హానికారక, విషపదార్థాలు బయటకు పోతాయి. 
 
* బెల్లంలోని ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. 
* శరీరంలో అధికంగా ఉండే నీటిశాతాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లంను మెడిసినల్ షుగర్‌గా పిలుస్తారు.