మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : సోమవారం, 12 నవంబరు 2018 (16:26 IST)

పెరుగుతో ఫేస్‌ప్యాక్ మంచిదేనా..?

మెరిసే చర్మం కోసం ఇంట్లోని ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. కీరదోస కంటి ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. మరి దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. దాంతో కీర ముక్కలను కళ్లపై గంటపాటు అలానే ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. నల్లటి వలయాలు, మెుటిమలు కూడా తొలగిపోతాయి. నిద్రలేని సమస్యతో బాధపడేవారు రోజూ కీరా ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం కలిపి సేవిస్తే సమస్య పోతుంది. 
 
శరీర ఒత్తిడి, అలసట వలన చర్మం ముడతలుగా మారుతుంది. అంతే కాదు.. చర్మంపై రంధ్రాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. అందుకు మంచి పరిష్కారం అరటిపండు. ఎలా అంటే.. అరటిపండును గుజ్జుగా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మ రంధ్రాలు తొలగిపోతాయి. 
 
పెరుగు ద్వారానే మజ్జిగ తయారుచేస్తారు. మరి ఈ రెండింటిని జతచేస్తే కలిగే ప్రయోజనాలు పరిశీలిద్దాం.. పెరుగులో కొద్దిగా తేనె, మజ్జిగ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది.

పెరుగు చర్మానికి కావలనిన తేమను అందిస్తుంది. కొందరైతే ఈ చలికాలంలో పెరుగు ఆరోగ్యానికి అంత మంచిగా కాదని అనుకుంటారు.. అలాంటి విషయాలను మాత్రం ఎప్పుడూ నమ్మకండి.. తేనె తరువాత పెరిగే సౌందర్య సాధనలో ఉపయోగపడుతుంది.