మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (11:58 IST)

తామర విత్తనాలతో పాప్‌కార్న్‌... వీర్య నాణ్యతకు పసందైన ఔషధం

తామర విత్తనాలకు అనేక పేర్లు ఉన్నాయి. లోటస్ సీట్, నట్, ఫాక్స్, మఖానా ఇలా పేరు ఏదైనా అవి అందించే పోషకాలు మాత్రం వెలకట్టలేనివి. వీటిలో విటమిన్లతో పాటు.. ఖనిజ లవణాలు,  పీచు పదార్థాలతో పాటు ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటితో తరుచూ పాప్‌కార్న్ చేసుకుని ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. 
 
* కాఫీ అడిక్షన్ పోగొట్టుకోవాలన్నా, కాఫీ తాగాలనిపించినపుడు కొద్దిగా తామర విత్తనాలను తింటే సరిపోతుంది. 
* తామర విత్తనాల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇది మలబద్ధక సమస్యకు మంచి నివారిణిగా పని చేస్తుంది. 
* ఈ విత్తనాల్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. తరచుగా ఆకలితో బాధపడే మధుమేహులు ఈ విత్తనాలను ఆరగించవచ్చు. 
* వీర్యం నాణ్యత తక్కువగా ఉన్న పురుషులు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుని ఆరగిస్తే ఎంతే మేలు జరుగుతుంది.
* తామర విత్తనాలు నిద్రలేమిని కూడా పోగొడుతాయి. 
* వీటిలో క్యాలరీలు, కొవ్వు,  సోడియం తక్కువ, కాబట్టి భోజనానికీ భోజనానికీ మధ్య ఆరగించొచ్చు. 
* పొటాషియ, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది రక్తపోటు సమస్యను అంటే బీపీని నియంత్రణలో ఉంచుంది.