శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (14:57 IST)

పెదాలు మృదువుగా మారాలంటే.. ఇలా చేయాలి..?

చలికాలం కారణంగా పెదాలు పొడిబారుతుంటాయి. దీని కారణంగా పలురకాల ఇన్‌ఫెక్షన్స్ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
  
 
శీతాకాలంలో వేజలైన్ దగ్గరుంటే పెదవులకు భద్రత చేకూరినట్లే. ఖరీదైన లిప్‌బామ్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వేజలైన్ లిప్‌బామ్స్‌ను కొనుకున్నట్లయితే పెదవులు పొడిబారకుండా సంరక్షించుకోవచ్చు. ముందుగా పెదవులపై నాజూకైన బ్రష్‌తో నెమ్మదిగా, గుండ్రంగా బ్రష్‌ చేయాలి. ఆ తరువాత లిప్‌స్టిక్ రాసుకుని, లిప్ లైనర్ వాడవచ్చు.
 
పెదవులు బాగా పగిలి ఇబ్బంది పెడుతున్నట్లయితే.. కర్పూరం, మెంథాల్‌ కలిసిన లిప్‌బామ్‌ను వాడాలి. దీని వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. విటమిన్ ‌ఇ టాబ్లెట్లు వాడాలి. తేనెను పెదాలకు రాయాలి. అలాగే ఈ కాలంలో చేతులు, పాదాలను పగుళ్ల నుండి కాపాడుకోవాలంటే, రాత్రి నిద్రకు ముందుగా చేతులకు, పాదాలకు ఆలివ్‌ ఆయిల్‌ను రాయాలి. మంచి మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ను కూడా వాడొచ్చు. గ్లిజరిన్‌ సబ్బులు కూడా మంచి చేస్తాయి.