మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (12:31 IST)

పెరుగు, పెసరపిండి ప్యాక్ వేసుకుంటే..?

చాలామంచి భోజనానంతరం పెరుగు కచ్చితంగా తింటారు. వారికి పెరుగు తినకపోతే భోజనం చేసినట్లనిపించదు. అదీ రాత్రి సమయంలో తీసుకుంటుంటారు. కొందరికి పెరుగు రాత్రిళ్లో సేవిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తుంటారు. కానీ, అది నిజం కాదు.. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పోషక విలువలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. ఇలాంటి పెరుగుతో చర్మ సౌందర్యానికి ఏర్పడే ప్రయోజనాలు చూద్దాం..
 
పెరుగులో కొద్దిగా కలబంద గుజ్జు, నిమ్మరసం, శెనగపిండి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచుగాగ చేస్తే చర్మంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. అలానే కొన్ని తమలపాకులను పొడిచేసి అందులో పావుకప్పు పెరుగు కలిపి కంటి కింద రాసుకుంటే నల్లటి మచ్చలు పోయి మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
పెరుగు చర్మానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. పావుకప్పు పెరుగులో 2 స్పూన్ల్ పెసరపిండి కొద్దిగా తేనె కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే చర్మంపై గల మృతకణాలు తొలగిపోయి తాజాగా మారుతుంది. అరకప్పు పెరుగులో చిటికెడు వేపాకు పొడి, స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది. 
 
రాత్రివేళ కప్పు మెంతులను నానబెట్టి ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో పావుకప్పు పెరుగు కలిపి తలకు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు రాలడం తొలగిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. చుండ్రు సమస్య కూడా ఉండదు.