మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (15:20 IST)

నిమ్మ తొక్కతో మర్దన చేస్తే..?

మెుటిమల కారణంగా ముఖ సౌందర్యం పాడైపోతుంది. అంతేకాదు.. బయటకు వెళ్లాలంటే కూడా విసుగుగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలంటే.. ఏం దేవుడా అంటూ బాధపడుతుంటారు. అందుకు ఇంట్లోని ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాల పొందవచ్చును. అవేంటో పరిశీలిద్దాం..
 
1. వేపాకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే మెుటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
2. పుదీనా ఆకులను నూనె వేయించి ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమలు రావు. 
 
3. చందనంలో రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా 15 రోజుల వాటు చేస్తే మెుటిమ సమస్య పోతుంది. 
 
4. తులసి ఆకుల రసాన్ని టమోటాల రసంలో కలుపుకుని మొటిమలకు పూస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై నిమ్మకాయ చెక్కతో రుద్దితే మొటిమల నుండి ఉపశమనం కలుగుతుంది.