రోజుకు నాలుగు కప్పులతో మొటిమలు మాయం
యుక్త వయసులో ఉండే అమ్మాయిల్లో 90 శాతం మంది మొటిమలతో బాధపడుతుంటారు. వీటిని పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో లభ్యమయ్యే అనేక రకాల క్రీములను వాడుతుంటారు. అయినా వాటి నుంచి విముక్తి పొందలేరు.
అయితే, మొటిమలతో బాధపడుతున్న అమ్మాయిలకు ఆనందం కలిగించే వార్తను పరిశోధకులు వెల్లడించారు. ఆ పరిశోధన మేరకు రోజుకు నాలుగు కప్పుల కాఫీ తగ్గితే మొటిమల బారినుంచి కొంత వరకూ తప్పించుకోవచ్చని తెలిపారు.
కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అధ్యయనకారులు చెబుతున్నారు. నిజానికి ముఖ సౌందర్య పరిరక్షణలో కూడా కాఫీ ఉపయోగపడుతుందన్న విషయం తెల్సిందే. కాఫీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే మొటిమలను తగ్గించడానికి దోహదపడతాయని వారు అంటున్నారు.