శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (12:21 IST)

బొల్లికి మందు.. ఎలుకలపై చేసిన ప్రయోగం సక్సెస్...

ప్రపంచంలో నయం చేయలేని వ్యాధుల్లో ఒకటి బొల్లి. ఈ సమస్యతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకినవారు మానసికంగా తీవ్రంగా కుంగిపోతారు. నలుగురితో కలిసి బయటికి వెళ్లలేరు. నలుగురిలో కలిసిపోయి కలివిడిగా ఉండలేరు. 
 
కానీ, ఇకపై ఆ సమస్య లేకుండా నిశ్చింతగా ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. సరికొత్త చికిత్సతో బొల్లిని దీర్ఘకాలంపాటు నియంత్రించవచ్చని వారంటున్నారు. ఈ మేరకు ఎలుకలపై వారుచేసిన ప్రయోగాలు విజయవంతమైనట్టు చెప్పారు. 
 
బొల్లికి తాత్కాలిక చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ.. శాశ్వతంగా నయం చేసే అవకాశం లేదు. పైగా చికిత్సకు రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటుంది. చికిత్స నిలిపివేసిన వెంటనే తెల్లమచ్చలు తిరిగి వస్తాయి. 
 
అలాకాకుండా.. బొల్లిని దీర్ఘకాలంపాటు నియంత్రణలో ఉంచే చికిత్సను యాలే యూనివర్సిటీకి చెందిన బొల్లి పరిశోధన, చికిత్స కేంద్రం పరిశోధకులు బొల్లికి మందు కనిపెట్టారు. ఎనిమిదేళ్లుగా పరిశోధనలు జరిపి.. ఎలుకల్లో తెల్లమచ్చలను తొలగించగలిగారు. వచ్చే వేసవిలో మనుషులపై ప్రయోగాలు చేయనున్నట్లు వెల్లడించారు.