శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 5 జూన్ 2018 (19:13 IST)

పురుషులు జామ పువ్వులు, జామ ఆకులు తింటే....

జామ పండులో అనేక రకములైన ప్రయోజనాలున్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే జామ ఆకులో మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుప

జామ పండులో అనేక రకములైన ప్రయోజనాలున్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే జామ ఆకులో మనకు తెలియని అనేక ఔషధ గుణాలున్నాయి. జామ ఆకులు మన శరీరంలో అనేక రకాల రుగ్మతల బారిన పడకుండా కాపాడతాయి. జామ ఆకులు, జామ బెరడు, జామ పువ్వులు కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని  ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానిక్స్, ఆక్సలేట్స్ ఉంటాయి. అందువల్ల నోటిపూత, నోటిలో పుండ్లు, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి నోటి సమస్యలతో బాధపడేవారు లేత జామ ఆకుల్ని నమిలినా లేదా లేత ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిట పడితే మంచి ఫలితాలను పొందవచ్చు.
 
2. జామ ఆకులు జుట్టుకి దివ్యౌషధంలా పని చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతాయి. సరిపడా జామ ఆకుల్ని శుభ్రం చేసుకుని తగినన్ని నీరు పోసి 15 నిముషాల సేపు మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలపై నెమ్మదిగా అప్లై చేస్తూ బాగా మర్దనా చేయాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు గట్టిపడి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
3. జామ ఆకులను నేరుగా లేదా జామ కషాయంగా తీసుకోవడం వలన అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సక్రమంగా అందేలా చూస్తుంది. అందువల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
 
4. జామ ఆకులు మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మొటిమల సమస్యతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా రుబ్బి ముఖానికి లేపనంలా పూసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
5. అన్నం సరిగా సహించకపోవడం, నోటి రుచి తగ్గడం వంటి సమస్యలతో బాధపడేవారు జామ ఆకుల్ని మెత్తగా పేస్ట్‌లా రుబ్బి దానికి కొద్దిగా ఉప్పు , అర చెంచా జీలకర్రను కలిపి వేడినీళ్లతో తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
 
6. జామ పువ్వులను మెత్తగా నూరి కళ్లపై ఉంచితే కళ్లు తేటగా తయారవుతాయి. కళ్ల కలక, కళ్లు నీరు కారడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలకు అద్బుత ఫలితం కనిపిస్తుంది. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా జామ ఆకులు కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది.
 
7. కీళ్ల నొప్పులతో బాధపడేవారు జామ ఆకులను కొద్దిగా వేడి చేసి వాపులున్న చోట కట్టుకుంటే కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.