మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (13:34 IST)

జ్ఞాపకశక్తి కోల్పోతున్నారా.. అయితే ఇలా చేయండి..?

నేటి జీవితంలో మనిషిపై ఒత్తిడి అధికమవుతుంది. దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువగా ఆధాపడడంతో సొంత జ్ఞాపకశక్తిని కూడా కోల్పోతున్నారు. ఈ సమస్య పెద్దలకే కాదు చిన్నారులపై అధికంగానే ఉంది. మరి జ్ఞాపకశక్తి పెంచేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
 
1. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా కూర్చుని న్యూస్‌ పేపర్స్ చదవాలి. దాంతో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. చదివే విధానం కూడా నిటారుగా ఉండాలి. అప్పుడే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
 
2. క్యారెట్స్, పాలకూర, గోంగూర, మునగాకు వంటి పదార్థాలతో తయారుచేసిన వంటకాలు తీసుకోవాలి. అలానే గోబీ పువ్వులో కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఉడికించుకుని సేవిస్తే శక్తి అధికమవుతుంది. 
 
3. చిన్నారులు పరీక్షా సమయంలో ఎక్కువగా చదువుతుంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంట కోసారి గ్లాస్ నీరు తాగాలి. అప్పుడే చదివినవన్నీ మరచిపోకుండా ఉంటాయి. 
 
4. ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహారంలో క్యాల్షియం శాతం అధిక మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఈ క్యాల్షియం అనే పదార్థం మెదడు ఉత్సాహానికి తోడ్పడుతుంది. 
 
5. పాలు, చీజ్, పెరుగు, బట్టర్ వంటి వాటిల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగులోని ఎమినో యాసిడ్స్ అనే ఆమ్లం జ్ఞాపకశక్తిని పెంచుటకు ఎంతగానో దోహదపడుతుంది. 
 
6. ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత గ్లాస్ మజ్జిగా తీసుకోవాలి. దాంతో జీర్ణవ్యవస్థ పనితీరును బాగుంటుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. 

7. రోజూ ఉదయాన్నే గంటపాటు వ్యాయామం చేస్తే కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.