పెరుగు, గోధుమ పిండితో అవి రావు..?
చలికాలంలో దోమలు ఎంత ఎక్కువగా ఉంటాయో బొద్దింకలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. అందుకు ఆయుర్వేదం ప్రకారం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.. అవేంటో తెలుసుకుందాం..
బొద్దింకలు ఎలా తొలగించాలంటే.. 10 గ్రాముల బోరిక్ యాసిడ్ పౌడర్, కొద్దిగా చక్కెర, పెరుగు, గోధుమ పిండి కలిపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను బొద్దింకలున్న ప్రాంతాల్లో అంటే.. అలమారాలు, ఫ్రిజ్ వెనుక భాగంలో, వంట గదిలో పెట్టాలి. దీంతో బొద్దింకలు రావు. దాంతో పాటు వీటి వలన ఏర్పడే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.
మరి దోమలు ఎలా తొలగించాలో చూద్దాం.. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని దోమలు ఉండే ప్రాంతంలో పెట్టాలి. సాధారణంగా మనం ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు మనకు కళ్ల నుండి నీరు కారుతుంది. కదా అదే విధంగా దోమలకు కూడా జరుగుతుంది. కాబట్టి ఉల్లిపాయను ఎక్కడ పెడితే మంచి ఉపశమనం లభిస్తుందో అక్కడ పెట్టండి..
అలానే సాధారణంలో చలికాలంలో సర్వసాధరణంగా చేతులు, కాళ్ళ పగుళ్ళ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ సమస్యల వలన ఏ పని చేయడానికైనా విసుగుగా ఉంటుంది. అందువలన ఆయుర్వేదం ప్రకారం పగుళ్ళకు చక్కెర రాసుకుంటే పగుళ్ళు తొలగిపోతాయని చెప్తున్నారు. చక్కెరను అలానే రాయకపోయినా గ్లాస్ నీటిలో కలిపి పాదాలు శుభ్రం చేసుకుంటే కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.