శృంగార రసాన్ని పెంచే తమలపాకుల రసం... నమిలి మింగితేనా?

Last Modified గురువారం, 8 నవంబరు 2018 (21:53 IST)
విందు భోజనం చేసి తమలపాకుల్ని, పాన్ మసాలాను తీసుకోవడం పరిపాటి. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయి. మౌత్ ఫ్రెష్నర్‌గా ఉపయోగపడే తమలపాకును నమలడం ద్వారా శృంగార జీవితం సంతోషమయంగా వుంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాదు తాంబూలం వేసుకోవడం ద్వారా అజీర్ణ సంబంధిత రోగాలు నయమవుతాయి. 
 
తమలపాకుల్లోని అప్రోడియాస్టిక్ పదార్థాలు లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో పాటు రక్తంలోని చక్కెర స్థాయిల్ని తమలపాకులు క్రమబద్ధీకరిస్తాయి. తమలపాకులో కాస్త తేనెను చేర్చి నమిలితే దగ్గు మటుమాయం అవుతుంది. అంతేగాకుండా.. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. తమలపాకుల రసాన్ని సేవించడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :