శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (11:35 IST)

ఆపిల్ తొక్క ప్యాక్‌తో కలిగే లాభాలు..?

చర్మం ఎంత అందంగా ఉన్నా కొన్ని కారణాల వలన ఆ అందం కాస్తి కాంతిహీనతంగా మారుతుంది. కొందరైతే దానికి తోడుగా తలకు నూనెను విపరీతంగా రాసుకుంటుంటారు.. దానివలనే ముఖం జిడ్డు జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డును తొలగించడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. వాటిని వాడడం వలన చర్మం ఇంకా జిడ్డుగా మారుతుందే కానీ.. ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు.. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే చాలు...
 
1. ముల్తానీ మట్టి మార్కెట్‌లో దొరికే పదార్థమే కాబట్టి దీనిని ఎలా ఉపయోగించాలో చూద్దాం.. మూల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే చర్మంపై గల జిడ్డు తొలగిపోయి తాజాగా మారుతుంది.
 
2. ఓట్స్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. మరి అందానికి ఎలానో చూద్దాం.. ఓట్స్‌ను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
3. చాలామంది ఆపిల్ తీనేటప్పుడు దాని తొక్కను పారేస్తుంటారు. ఆపిల్ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకుంటే ఆ పొట్టును పారేయరు.. ముఖంపై మెుటిమలు తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్స్‌కు వెళ్తుంటారు. ఈ చిన్న విషయానికే పార్లర్‌కు వెళ్లవలసిన అవసరం లేదని చెప్తున్నారు.. ఎందుకంటే వాటిని తొలగించే శక్తి ఆపిల్‌లో అధికంగా ఉందని చెప్తున్నారు. మరి ఎలానో తెలుసుకుందాం..
 
4. ఆపిల్ తొక్కలను మెత్తని పేస్ట్‌లా చేసి అందులో 2 స్పూన్స్ తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అది బాగా ఆరిన తరువాత 5 నిమిషాల పాటు మర్దన చేసుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే మెుటిమలు పోతాయి. 
 
5. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగించాలంటే.. టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గుజ్జులో కొద్దిగా మెంతిపొడి, పెరుగు, కీరదోస రసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.