శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:20 IST)

కాఫీ పొడి, ఉప్పుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

కొందరికి మేకప్ వేసుకునే వాళ్లను చూస్తే విసుగుగా ఉంటుంది. ఎందుకంటే వారి ముఖచర్మానికి ఆ మేకప్స్ సెట్ కావు. మరికొందరైతే మేకప్ లేకుండా ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా తప్పకుండా మేకప్ వేసుకునే వెళ్తుంటారు. ఎక్కువగా మేకప్ వేసుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది కాదని బ్యూటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మేకప్ లేకుండా ఎలా అందాన్ని పొందాలో తెలుసుకుందాం...
 
బయటకు వెళ్లే ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఇలా చేస్తే వాతావరణంలో గల దుమ్మూ, ధూళి ముఖానికి చేరవు. చర్మంలోని మృతుకణాల కారణంగా ముఖంపై మెుటిమలు, కురుపులు వస్తుంటాయి. వీటిని తొలగించాలంటే.. వంటసోడాను వాటిపై రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే కోమలమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును.
 
ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు వేడినీళ్లల్లో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మరసం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని శుద్ధిచేస్తుంది. అలానే టమోటా గుజ్జులో కొద్దిగా పెరుగు, మెంతిపొడి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్స్ వేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్స్, ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవని చెప్తున్నారు. 
 
కాఫీ పొడిలో కొద్దిగా ఉప్పు, తేనె, కీరదోస రసం కలిపి ముఖానికి మెడకు పూతలా వేసుకోవాలి. రెండు గంటల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మెడ భాగంలో గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం తాజాగా మారుతుంది. కాఫీ పొడిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి.