గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (18:09 IST)

మోచేతులు నల్లగా ఉన్నాయా.. ఇలా చేస్తే..?

సాధారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మోచేతులు నల్లగా, బరకగా ఉంటాయి. ఇలాంటి చిన్న చేతులున్న దుస్తులు వేసుకోవాలంటే చాలా కష్టమే. ఎందుకంటే.. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు సంతోషంగా గడపాలనే అనుకుంటాం. కానీ, ఈ చిన్న చిన్న సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి అందుకు ఏం చేస్తే.. ఉపశమనం లభిస్తుందో... చూద్దాం..
 
1. బాదం పప్పులను రాత్రివేళ నానబెట్టి ఉదయాన్నే పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు, తేనె కలిపి మోచేతులకు రాసుకోవాలి. గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే.. మోచేతిపై గల నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.
 
2. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మోచేతులు మృదువుగా మారుతాయి. అలాకాకుంటే ఒట్టి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను కూడా రాసుకోవచ్చు.
 
3. నిమ్మకాయ ముక్కకు పంచదారలో అద్ది మోచేతులు, మోకాళ్ల మీద 10 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. ఈ పద్ధతులు పాటించే ముందుగా మోచేతులు, కాళ్లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 
 
4. వంటసోడాలో కొద్దిగా నీరు, ఉప్పు కలిపి మోచేతులు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే మోచేతులు తాజాగా, కాంతివంతంగా మారుతాయి. 
 
5. అరటిపండు తొక్కతో మోచేతులు రుద్దుకుంటే కూడా ఆ నలుపు పోతుంది. అలాకాకుంటే ఈ పొడిచేసుకుని అందులో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.