శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (11:41 IST)

ఉసిరికాయ, పెరుగుతో తెల్లజుట్టు పోతుందా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికైతే వయస్సు తేడా లేకుండా జుట్టు తెల్లబడుతోంది. చుండ్రు వలన జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. వీటినన్నింటి నుండి ఉపశమనం లభించాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. అవేంటో చూద్దాం...
 
గోరింటాకు చేతులకు పెట్టుకుంటే చాలా అందగా ఉంటుంది. మరి జుట్టుకు రాసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.. గోరింటాకులను బాగా ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా గుడ్డుసొన, నిమ్మరసం, కాఫీపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో ఒకటి లేదా రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య పోతుంది. 
 
ఉసిరి కాయలను కాస్త నూనెలో వేయించి పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర, ఉప్పు, వంటసోడా, మెంతిపొడి కలిపి జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే తెల్లజుట్టు పోతుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. ఈ ఉసిరి మిశ్రమంలో కొద్దిగా గోరింటాకు పొడి, నిమ్మరసం, గుడ్డుసొన కలిపి జుట్టుకు పూతలా వేసుకోవాలి. రెండు గంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 
 
ఉసిరికాయలను ఎండబెట్టి పొడిచేసి అందులో 2 కప్పుల పెరుగు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే తెల్లజుట్టు పోతుంది. తద్వారా ఇతర వెంట్రుకల సమస్యలు కూడా తొలగిపోతాయి.