మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (18:32 IST)

అధికబరువుతో "ఆ"సక్తి తగ్గిపోతుందా?

ఊబకాయంతో కామ కోర్కెలు తగ్గిపోతాయా? అనే ధర్మ సందేహం చాలామందిలో నెలకొంటుది. అధిక బరువు కారణంగా తనకు ఆసక్తి తగ్గిపోయిందని పలువురు స్త్రీపురుషులు చెబుతుంటారు. సన్నగా ఉన్నపుడు చాలా యాక్టివ్‌గా ఉండే వారు.. కాస్తంత బరువు పెరిగాక ఆ కోర్కెలు తగ్గిపోయాని చెపుతున్నారు. అంటే ఊబకాయం వల్ల నిజంగానే ఆ కోర్కెలు తగ్గిపోతాయా? అనే అంశంపై వైద్య నిపుణులను సంప్రదిస్తే, 
 
నిజానికి బరువు పెరగటం ఓ సమస్య అయితే.. మారిన రూపంతో ఆత్మనూన్యతకు లోనుకావడం అనేది అంతకంటే పెద్ద సమస్య. తన రూపం మీద ఏర్పడిన అయిష్టాన్ని పోగొట్టుకుని, కంఫర్ట్‌గా ఫీలవడం కోసం ఊబకాయులు ఆహారాన్ని ఎంచుకుంటారు. మానసిక ఒత్తిడిలో ఇదో కోణం. దీనివల్లే బరువు పెరగడం, లైంగికాసక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అయితే, ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలెన్నో ఉన్నాయి. 
 
ముఖ్యంగా ఆకారంపై ఏర్పడిన అయిష్టాన్ని పోగొట్టాలి. ఈ విషయంలో స్త్రీ తనవంతు సహకారం అందించాలి. ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్లాలి. లేదా ఈత, జాగింగ్, ఆటలు వంటి శారీరక శ్రమతో కూడిన వ్యాయమాల్లో చేయాలి. పిండిపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌తో పాటు.. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. 
 
పైగా, పడక గదిలో శారీరకంగా కలవడం కంటే.. ఇతర మార్గాలతో బాహ్యరతి ద్వారా సంతృప్తి పొందేలా ప్రయత్నించాలి. ఇలాంటి చర్యల ద్వారా స్త్రీపురుషుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చు. ఇలా కొంతకాలం పాటు జీవనశైలిని మార్చుకోగలిగితే ఊబకాయం కారణంగా ఏర్పడిన అనాసక్తి కాస్త ఆసక్తిగా మారి పడక గదిలో మస్తు ఎంజాయ్ చేయొచ్చని శృంగార వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.