మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (20:52 IST)

మనమేమీ అడ్వాన్స్ కాలేదుగా... నన్ను మర్చిపో అంటోంది... ఏం చేయాలి?

నేను అందగాడిని కాదు. చాలా సైలెంట్ వ్యక్తిని. కాలేజీకి వెళ్లేవాడినే కానీ.... నా చదువేంటో అన్నట్లుగా ఉండేవాడిని. కాలేజీలో పాలరాతి శిల్పం అని మా క్లాస్‌మేట్స్‌లో ఓ అమ్మాయిని పిలుస్తుండేవారు. ఐతే ఆ అమ్మాయి ఓ రోజు నన్ను పలుకరించింది. ఆ తర్వాత మెల్లగా మామధ్య స్నేహం కుదిరింది. అలా స్నేహం చేస్తూనే నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది. ముందు నమ్మలేకపోయాను. ఐతే ఆ తర్వాత ఆమె చెప్పేది నిజమేనని తెలుసుకుని ఎంతో థ్రిల్ ఫీలయ్యా.
 
మా కాలేజి అంతా నా వైపు ఈర్ష్యగా చూసేవారు. అలా మా కాలేజీ చదువు కూడా పూర్తయ్యింది. ఇపుడు ఉద్యోగాల్లో చేరిపోయాం. ఎవరి పనుల్లో వారు బిజీ కావడంతో మాట్లాడుకోవడం కూడా తగ్గింది. ఐతే ఈమధ్య నాకు ఫోన్ చేసి తనకు పెళ్లి కుదిరిందని చెప్తోంది. మరి మన ప్రేమ సంగతి అని అడిగితే... మనమేమీ అడ్వాన్స్ కాలేదు కదా. ఐనా ఇద్దరి మధ్య అంత ఇంటిమేటెడ్ మూవ్‌మెంట్స్ జరుగలేదు కదా అని అంటోంది. ఎందుకిలా మాట్లాడుతుందో నాకర్థం కావడంలేదు. బుర్ర పగిలిపోతోంది...
 
అది నిజమైన ప్రేమ కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఆమె నిర్ణయం మారిపోయింది. కాబట్టి ఇక ఆమెను మర్చిపోవడం మంచిది. ఇంటిమేట్‌గా మూవ్ కాలేదు కాబట్టి అని ఆమె మెన్షన్ చేయడాన్నిబట్టే మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలహీనమైనదో అర్థమవుతుంది. కనుక అది ఓ చేదు జ్ఞాపకంగా వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి.