1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (14:54 IST)

బియ్యం పిండి ప్యాక్‌తో..?

ముఖాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా చర్మం జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. అందుకు ఏవేవో క్రీములు, మందులు వాడుతుంటారు. అయినను ప్రయోజనం ఉండదు. ఏ ప్రయత్నాలు చేసినా జిడ్డు చర్మం అలానే ఉందని బాధపడుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో పరిశీలిద్దాం..
 
పావుకప్పు బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, బియ్యంపిండి కలిపి ముఖ చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆపై చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజులు చేస్తే తప్పక ఫలితాలు పొందవచ్చును. తరువాత ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత వెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం పోతుంది. 
 
ఐస్‌క్యూబ్స్‌ను నీటిలో కరిగించి ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు కలిపి ప్యాక్ వేసుకుంటే మెుటిమ సమస్య ఉండదు. నల్లటి మచ్చలు కూడా రావు. అరకప్పు పెసరపిండిలో 2 స్పూన్ల పెరుగు కలిగి ముఖానికి స్క్రబ్ చేసి,  అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మ జిడ్డుతనం పోతుంది.