సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (16:50 IST)

బొప్పాయి గుజ్జు ముఖానికి పట్టిస్తే..?

చలికాలంలో చాలామందికి ముఖం పొడిబారి చర్మమంతా అలసట, నీరసంగా ఉంటుంది. వీటి నుండి ఉపశమనం లభించాలని రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌‌లు వాడుతుంటారు. దాంతో సమస్య మరింత ఎక్కువగా మారుతుంది. అందుకు ఇంట్లోని సహజసిద్ధమైన పద్ధతులు పాటిస్తే చక్కని ఫలితాలు పొందవచ్చును.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
తప్పకుండా అందరూ ప్రతిరోజూ స్నానం చేస్తూనే ఉంటారు. అయినా చర్మమంతా తెల్లతెల్లగా మారి దురదలు పెడుతూ వుంటుంది కొందరికి. అలాంటప్పుడు స్నానానికి వాడే సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించాలి. 
 
ఒక పెద్ద అరటిపండును తొక్కతీసి.. పండును గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జులో 2 స్పూన్ల గులాబీ నీరు కొద్దిగా తేనె, పాలపొడి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుని పొడి టవల్‌తో తుడుచుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. 
 
బొప్పాయి పండు ఈ సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. కాబట్టి ఓ బొప్పాయి పండు రెండు సగాలుగా కట్ చేసి వాటిలోని గింజలు తీసేయాలి. ఆ తరువాత దాని తొక్కను తీసి పండును గుజ్జులా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, ఆపిల్ రసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. రెండుగంటల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చాలు. చర్మం సున్నితంగా తయారవుతుంది.