సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (13:45 IST)

జిడ్డు చర్మాన్ని తొలగించాలంటే.. ఇలా చేయాలి..?

జిడ్డు చర్మం గలవారు ఇంట్లో దొరికే పదార్థాలతో ప్యాక్ తయారుచేసి ముఖానికి రాసుకుంటే ముఖాన్ని కాంతివంతం చేయెచ్చు. అదెలాగంటే.. పది ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్‌లా తయారుచేసి అందులో నిమ్మరసం కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
 
ఒకవేళ ఇలాంటి పండ్లు సౌందర్య సాధనాలను ఉపయోగించి ప్యాక్ చేసేందుకు సమయం, ఓపికా లేనప్పుడు.. నిమ్మకాయను సగానికి కోసి, ఒక చెక్కతో ముఖాన్నంతటినీ బాగా రుద్ది 15 నిమిషాల పాటు మర్దనా చేసి అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసినట్లయితే.. ముఖంలో జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది.
 
ఇలా చేయడం వలన నిమ్మరసంలో ఉండే నేచురల్ క్లెన్సర్లు చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ద్రాక్ష పండ్ల రసం వలన చర్మానికి మృదుత్వం వస్తుంది. కోడిగుడ్డు వల్ల చర్మం వదులుకాకుండా కాపాడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్యాక్‌ను పొడి చర్మం గలవారు మాత్రం వాడకూడదు. ఒకవేళ వాడినట్లయితే.. వారి చర్మం మరింత పొడిబారిపోతుంది.