శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (13:50 IST)

గోధుమ పిండి, నిమ్మచెక్కతో ప్యాక్ వేసుకుంటే..?

జిడ్డు చర్మాన్ని ఎలా తొలగించాలని ఆలోచిస్తున్నారా.. ఇలా చేయండి మంచి ఉపశమనం లభిస్తుంది. శెనగపిండిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ చర్మాన్ని తాజాగా మార్చుతాయి. మరి దీనితో ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం...
 
1. శెనగపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా మారుతుంది. 
 
2. గోధుమ పిండిలో కొన్ని నిమ్మ చెక్కలు వేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని గంట తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తద్వారా చర్మం మృదువుగా మారుతుంది. 
 
3. పాలను మరిగించినప్పుడు దాని నుండి వచ్చే మీగడను పారేస్తుంటారు. మీగడలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. పారేయాలనిపించదు. అవేంటో చూద్దాం.. మీగడ పొడిబారిన చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. 
 
4. మీగడలో కొద్దిగా పెరుగు, కీరదోస మిశ్రమం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖచర్మం తాజాగా మెరుస్తుంది. 
 
5. గోధుమ పిండిలో కొన్ని మెంతులు వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు పసుపు కొద్దిగా కలబంద గుజ్జు వేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చును.