లాక్‌డౌన్ కారణం.. అక్కపై తమ్ముడి అత్యాచారం
గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల మైనర్ బాలుడు, 16 ఏళ్ల తన టీనేజ్ అక్కపై లైంగిక దాడి చేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. గ్రేటర్ నోయిడాలో నివసించే ఒక పేద కుటుంబంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తుండగా.. తల్లి అక్కడి ఇళ్లలో సహాయకురాలిగా ఇంటి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. తల్లితండ్రులు పనులకు వెళ్లినప్పుడు బాలుడు, తన అక్కపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. కొన్నాళ్లకు బాలిక శరీరంలో మార్పులు గమనించిన తల్లి కూతుర్ని నిలదీసి అడిగింది.
దీంతో బాలిక తమ్ముడు తనపై రెండుసార్లు అత్యాచారం చేసిన విషయాన్ని తల్లికి వివరించింది. ఆ సమయంలో ఇలాంటి పరిస్ధితి వస్తుందని తామిద్దరికీ తెలియదని బాలిక చెప్పింది. బాలిక పరిస్ధితి గమనించిన తల్లి చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.