గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (23:11 IST)

చెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు.. వీడియోలు చూస్తుందని చంపేశాడు..

అన్నయ్య చెల్లెమ్మకు ప్రేమగా స్మార్ట్ ఫోన్ తీసిచ్చాడు. కానీ అదే చెల్లెలి ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం జరిగింది. ఫోన్‌లో అదేపనిగా వీడియోలు చూస్తోందని చెల్లిని కత్తితో పొడిచి చంపాడు అన్నయ్య.

సుడలై అనే వ్యక్తి తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడు సమీపంలోని వాసవంపురంలో నివాసం ఉంటున్నాడు. రైతు అయిన సుడలైకి కొడుకు మలైరాజా(20), కూతురు కవిత(17) ఉన్నారు. 
 
కవిత ప్లస్ టూ చదువుతోంది. కాగా, మలైరాజా తన చెల్లి కవితకు ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్‌పోన్‌లో వీడియోలు చూడటం మొదలుపెట్టింది. ఈ విషయమై మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. అయినా కవిత పట్టించుకోలేదు. 
 
ప్రతి రోజు దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని కోపానికి లోనైన మలైరాజా.. కవితను వెనుక నుంచి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలపాలైన కవిత మృతి చెందింది. ఆ తర్వాత మలైరాజా అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వల్లానాడు సమీపంలో రాజాను పోలీసులు అరెస్ట్ చేశారు.