గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జులై 2021 (09:28 IST)

మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల లైంగిక దాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఇద్దరు కామాంధులకు స్వయానా బాధితురాలి సోదరి సహకరించడం విశేషం. ఈ కేసుకు సంబంధించి ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుల్తాన్‌పూర్‌ జిల్లాలో తనిఖీల్లో భాగంగా గత మంగళవారం రాత్రి పోలీసులు సుల్తాన్‌పూర్‌లో ఓ లగ్జరీ బస్సును ఆపారు. అందులో తనిఖీ నిర్వహిస్తుండగా, చివరి సీటు కింద ముగ్గురు చిన్నారులను గుర్తించారు. వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. 
 
వారిని విచారించగా ఓ అమ్మాయిపై లైంగిక దాడి జరిపినట్లు తేలిందని పోలీసు అధికారి బల్దీరాయ్‌ రాజారామ్‌ చౌదరీ చెప్పారు. దీంతో బస్సు డ్రైవర్‌తోపాటు, ఓ బాలుడు, బాధితురాలి సవతి సోదరిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.