శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:55 IST)

ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంకావాలి.. కాంగ్రెస్ నేత పిలుపు.. అరెస్టు

arrest
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేందుకు సిద్ధం కావాలంటూ ఓ కాంగ్రెస్ నేత పిలుపునిచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ తరహా పిలుపునిచ్చిన వ్యక్తిని అరెస్టు చేయించారు. 
 
అరెస్టు అయిన కాంగ్రెస్ నేత పేరు రాజా. ప్రధాని మోడీని ఉద్దేశించిన రాజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై దేశ వ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో పన్నాలోని పవాయ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఓ పోలీస్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. 
 
కాగా, కాంగ్రెస్ నేత రాజా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, "ఎన్నికలే లేకుండా మోడీ చేస్తారు. ఈ దేశాన్ని మతం, కులం, భా, ఆధారంగా మోడీ ముక్కలు చేస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రమాదంలో పడతారు. మన దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మోడీని చంపేందుకు సిద్ధంగా కావాలి" అని పిలుపునిచ్చారు.