శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:36 IST)

ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావు

jairam ramesh
ఎన్నికలంటే ఒకరిద్దరి మధ్య జరిగే అందాల పోటీలు కావని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో గెలవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. 
 
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ, ఈ యాత్ర సానుకూల ఫలితాలను ఇచ్చిందన్నారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి, యువ నేత సచిన్ పైలెట్ల మధ్య ఎలాంటి రాజకీయ పోరు లేదని ఆయన స్పష్టంచేశారు. వారిద్దరూ పార్టీకి ఎంతో విలువైన వ్యక్తులని వారి మధ్య ఉన్నవికేవలం అభిప్రాయభేదాలు మాత్రమేనని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. 
 
రాజస్థాన్‌కు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఓ మహిళకు కాంగ్రెస్ అవకాశం ఇస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఒకటి రెండుసార్లు మినహా కాంగ్రెస్ ఎపుడూ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు, మేనిఫెస్టోల మీద గుర్తుల మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు.