శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (11:13 IST)

కర్ణాటకలో ఐదేళ్ల బాలికను సోకిన జికా వైరస్

Zika
కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన ఐదేళ్ల బాలికకు జికా వైరస్‌ సోకింది. కేరళ, మహారాష్ట్ర జికా వైరస్‌ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటకలో తొలిసారిగా జికా వైరస్ వెలుగుచూసింది. 
 
కర్ణాటకలో ఐదేళ్ల బాలికకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారించినందున, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచించారు. 
 
అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా జికా వైరస్ నమోదైందని.. పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా పర్యవేక్షిస్తుందని తెలిపారు.