ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (19:55 IST)

భారత్‌లోనే యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా రంగం సిద్ధం

TATA Group
టాటా గ్రూపునకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు టాటా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 
 
ఇందుకోసం.. రూ.5000 కోట్లకు కర్ణాటకలోని విస్ట్రాన్ తయారీ గిడ్డంగిని కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల్లో ఒప్పందం కుదిరితే టాటా ఎలక్ట్రానిక్స్ యాపిల్ ఐఫోన్‌లను భారతదేశంలోనే తయారు చేస్తుంది.