ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (11:53 IST)

పొట్టలో 187 నాణేలు.. ఎలా తట్టుకున్నాడయ్యా...?

కర్ణాటకలో యువకుడి పొట్టలో 187 నాణేలను ఆపరేషన్ చేసి వైద్యులు వెలికి తీశారు. ఇందుకోసం వైద్యులు రెండు గంటల పాటు కష్టపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. 
 
ఇందుకు తోడు అతనికి వాంతులు, పొట్టలో నొప్పి ఏర్పడ్డాయి. నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో హనగల్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువకుడి కడుపులో నాణేలు వున్నట్లు గుర్తించారు.
 
ఆపై శస్త్రచికిత్స ద్వారా ఆపరేషన్ చేసి, రెండు గంటల పాటు కష్టపడి నాణాలన్నీ బయటకు తీశారు. మొత్తం 187 నాణేలను వెలికి తీసినట్లు వైద్యులు చెప్పారు. 
 
బాధితుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా వుందని.. కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పుకొచ్చారు.