Flash flood, కొండపై క్లౌడ్ బరస్ట్, భారీ వంతెన తునాతునకలు, వీడియో
ఇంతకుముందు మనం చూడని ఉపద్రవాలు ఇప్పుడు చూడాల్సి వస్తోంది. అవే Flash Floods, cloudbursts. మేఘాలు ఒక్కసారిగా కమ్ముకుని ఒకేచోట వర్షాన్ని కుమ్మరించేస్తున్నాయి. దీన్ని క్లౌడ్ బరెస్ట్ అంటుండగా ఆ భారీవర్షం వల్ల తలెత్తుతున్న వరదను ఫ్లాష్ ఫ్లడ్స్ అంటున్నారు. ఇటువంటివి మన దేశంలో అక్కడక్కడా గోచరమవుతూనే వున్నాయి. ఇట్లాంటి ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా నితి వ్యాలీలో జరిగింది.
క్లౌడ్ బరస్ట్ కావడంతో కొండలపై భారీగా వర్షపు నీరు చేరింది. నీటిమట్టం అనూహ్యంగా పెరిగిపోయి కొండల్లోని బండరాళ్లతో కలిసి ఒక్కసారిగా వరద నీరు తమక్ నాలాపై వున్న మెటల్ బేలీ వంతెన (Bailey Bridge)ను తునాతునకులు చేసింది. పరిమితికి మించి ఉప్పొంగి వర్షపు నీరు రావడంతో నీటి ప్రవాహంలో బురద, కొండరాళ్లు కలిసి తీవ్ర వేగంతో వచ్చి వంతెనను బలంగా ఢీకొట్టాయి. దాంతో వంతెన తునాతునకలైంది. వంతెన వద్ద ప్రవాహాన్ని పరిశీలిస్తున్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఒక వాహనంతో పాటు డ్రైవరు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాడు.
चमोली जिले की नीति घाटी में तमक नाले के उफनाने से नाले पर निर्मित पुल क्षतिग्रस्त। मलारी गांव से आगे आवाजाही हुई बाधित। किसी व्यक्ति के हताहत होने की नहीं है अभी तक कोई सूचना। जिला प्रशासन, SDRF और NDRF की टीम मौके के लिए रवाना।#Chamoli #Uttarakhand #UttarakhandPolice pic.twitter.com/GFLYFWlB4M
— Uttarakhand Police (@uttarakhandcops) August 10, 2026

